Sajjala Ramakrishna: ముందస్తు బెయిల్ ఇవ్వండి
ABN , Publish Date - Jun 14 , 2025 | 04:25 AM
సంకరజాతి తెగ అంటూ రాజధాని ప్రాంత ప్రజలనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో నమోదైన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ...
అనుచిత వ్యాఖ్యల కేసులో హైకోర్టును ఆశ్రయించిన సజ్జల
అమరావతి, జూన్ 13(ఆంధ్రజ్యోతి): సంకరజాతి తెగ అంటూ రాజధాని ప్రాంత ప్రజలనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో నమోదైన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి రైతు దళిత జేఏసీ నాయకురాలు కంభంపాటి శిరీష ఫిర్యాదు ఆధారంగా తాడేపల్లి పోలీసులు నమోదుచేసిన కేసుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ఫిర్యాదులు చేస్తే వాటి అన్నింటిలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. పోలీసులు కోరినప్పుడు దర్యాప్తుకు అందుబాటులో ఉంటామన్నారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.