Sajjala Ramakrishna: పోలీసులపైనా కేసులు పెడతాం
ABN , Publish Date - Jul 15 , 2025 | 04:34 AM
వైసీపీ నాయకులు తమ బలాన్ని చూపితే పరిస్థితి ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుసుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
మా ప్రభుత్వం వచ్చాక తప్పించుకోలేరు: సజ్జల
అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకులు తమ బలాన్ని చూపితే పరిస్థితి ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుసుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తమ వారిపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై తాము అధికారంలోకి వచ్చాక కేసులు పెడతామని హెచ్చరించారు. సోమవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. పోలీసుల పహారాలో వైసీపీ నేతలపై టీడీపీ నాయకులు దాడులకు దిగుతున్నారని విమర్శించారు. తమ ఓపికను చేతకాని తనంగా తీసుకోవద్దని, తమ ప్రభుత్వం వచ్చాక కేసులన్నీ తిరగతోడుతామని అన్నారు. పోలీసులు కూడా తప్పించుకోలేరని హెచ్చరించారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, ఎమర్జెన్సీ పాలన సాగుతోందని ఆరోపించారు.