Chaganti Koteswara Rao: చాగంటి కోటేశ్వరరావుకు సాహితీ పురస్కారం
ABN , Publish Date - Oct 06 , 2025 | 02:57 AM
బ్రహ్మశ్రీ పోలూరి హనుమజ్జానకీరామశర్మ సాహితీ పురస్కారాన్ని ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, ప్రవచన రత్నాకర డాక్టర్ చాగంటి కోటేశ్వరరావుకు....
ప్రదానం చేయనున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
అఫ్జల్‌గంజ్, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): బ్రహ్మశ్రీ పోలూరి హనుమజ్జానకీరామశర్మ సాహితీ పురస్కారాన్ని ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, ప్రవచన రత్నాకర డాక్టర్ చాగంటి కోటేశ్వరరావుకు ప్రదానం చేయనున్నారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 6గంటలకు హైదరాబాద్ అబిడ్స్‌లోని డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో దీన్ని ప్రదానం చేస్తారు. తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ పురస్కారాన్ని అందజేస్తారని పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య తెలిపారు. పురస్కారం కింద రూ.25వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, శాలువాతో పురస్కార గ్రహీతను సత్కరిస్తారని తెలిపారు.