Collector Tamim Ansaria: పరిమిత స్థాయిలోనే యురేనియం
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:07 AM
తురకపాలెం గ్రామంలోని నీటి వనరుల్లో యురేనియం పరిమితికి లోబడే ఉందని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుంటూరు..
గుంటూరు మెడికల్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తురకపాలెం గ్రామంలోని నీటి వనరుల్లో యురేనియం పరిమితికి లోబడే ఉందని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం స్పష్టం చేశారు. తురకపాలెంలో వరుస మరణాలు సంభవించిన నేపథ్యంలో సెకండరీ హెల్త్ సంచాలకురాలు డాక్టర్ సిరి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ గ్రామంలోని నీటి వనరులు, మరణించిన వారి ఇళ్లలోని బోరు బావుల నుంచి 8 నీటి నమూనాలు సేకరించినట్లు కలెక్టర్ తెలిపారు. వాటిని పరీక్షించగా.. 4 నమూనాల్లో యురేనియం ఆనవాళ్లు అనుమతించిన పరిమితి లోపలే నమోదయ్యాయని స్పష్టం చేశారు. బయాలజికల్ కాలుష్యం నియంత్రణ కోసం గ్రామానికి ట్యాంకర్ల ద్వారా మంచి నీటి సరఫరా జరుగుతోందని వివరించారు.