Civil Supplies: పౌరసరఫరాల సంస్థ ఎండీగా డిల్లీరావు బాధ్యతలు
ABN , Publish Date - Oct 18 , 2025 | 06:31 AM
ప్రభుత్వానికి ధాన్యం విక్రయించిన రైతులకు మద్దతు ధర ప్రకారం సొమ్మును సకాలంలో చెల్లించడంతో పాటు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నాణ్యమైన బియ్యం..
అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వానికి ధాన్యం విక్రయించిన రైతులకు మద్దతు ధర ప్రకారం సొమ్మును సకాలంలో చెల్లించడంతో పాటు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నాణ్యమైన బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేసేందుకు కృషి చేస్తాన’ని పౌరసరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.డిల్లీరావు చెప్పారు. ఇటీవలే ఈ పోస్టులో నియమితులైన ఆయన శుక్రవారం విజయవాడలోని సివిల్ సప్లయిస్ భవన్‌లోని తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. సీఎం చంద్రబాబు తనపై నమ్మకం ఉంచి, అప్పగించిన ఈ కొత్త బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానన్నారు. సివిల్ సప్లయిస్ డైరెక్టరుగా రోణంకి గోవిందరావు కూడా ఇటీవల బాధ్యతలు చేపట్టారు.