Share News

ఆర్డీటీ రెన్యువల్‌ సాధిస్తాం: మంత్రి సవిత

ABN , Publish Date - Sep 24 , 2025 | 05:45 AM

రాయలసీమ అభివృద్ధిలో రూరల్‌ డెవల్‌పమెంట్‌ ట్రస్ట్‌(ఆర్డీటీ) కీలకపాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్య, వైద్య, మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేస్తోంది...

ఆర్డీటీ రెన్యువల్‌ సాధిస్తాం: మంత్రి సవిత

అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ‘రాయలసీమ అభివృద్ధిలో రూరల్‌ డెవల్‌పమెంట్‌ ట్రస్ట్‌(ఆర్డీటీ) కీలకపాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్య, వైద్య, మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేస్తోంది’ అని మంత్రి సవిత అన్నారు. మంగళవారం అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడారు. ‘వందేళ్ల నుంచి అనంతపురం జిల్లా అభివృద్ధికి ఆర్డీటీ దోహదపడుతోంది. ఆసంస్థను ఫారెన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌(ఎ్‌ఫసీఆర్‌ఏ) కింద రెన్యువల్‌ చేసేందుకు కృషి చేస్తాం. ఈ అంశంపై సీఎం చంద్రబాబు సూచన మేరకు కేంద్ర మంత్రి అమిత్‌షా, ఇతర నేతలను కలిశాం. ప్రధానితో మాట్లాడి, రెన్యువల్‌ చేయిస్తానని మంత్రి లోకేశ్‌ హామీ ఇచ్చారు. ఆ బాధ్యతను కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎంపీ సానా సతీశ్‌కు అప్పగించినట్లు లోకేశ్‌ తెలిపారు. ఆర్డీటీపై వైసీపీ హడావుడి చేస్తోంది’ అని మండిపడ్డారు. మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ... ఆర్డీటీ రెన్యువల్‌ సాధిస్తామని, దీనిపై రాయలసీమ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇదే అంశంపై ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెస్‌ రాజు, దగ్గుపాటి ప్రసాదరావు, అమిలినేని సురేంద్రబాబు, బండారు శ్రావణి, పల్లె సింధూరరెడ్డి మాట్లాడుతూ, ఆర్డీటీ అందించిన సేవలను వివరించారు.

Updated Date - Sep 24 , 2025 | 05:45 AM