Share News

ఉల్లి కోసం పరుగులు

ABN , Publish Date - Sep 21 , 2025 | 11:57 PM

కర్నూలు మార్కెట్‌ యార్డులో ఉల్లి కోసం నగర ప్రజలు పరుగులు పెట్టారు. ఆదివారం యార్డు ప్రాంతమంతా జాతరను తలపించింది.

   ఉల్లి కోసం పరుగులు

బస్తా రూ.100కు అమ్మకం

జాతరను తలపించిన యార్డు ఆవరణం

కర్నూలు అగ్రికల్చర్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మార్కెట్‌ యార్డులో ఉల్లి కోసం నగర ప్రజలు పరుగులు పెట్టారు. ఆదివారం యార్డు ప్రాంతమంతా జాతరను తలపించింది. కలెక్టర్‌ సిరితో పాటు జేసీ నవ్య యార్డులో కలియ తిరుగుతూ పర్యవేక్షిం చారు. రెవెన్యూ, పోలీసు, మార్కెట్‌ కమిటీ యార్డులను సమన్వయ పరిచి ఉల్లి అమ్మకాల్లో తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మార్క్‌ఫెడ్‌ అధికారులు 19వేల క్వింటాళ్ల ఉల్లిని యార్డులో నిల్వ ఉంచారన్నారు. ఈ ఉల్లిని త్వరితగతిన బయటకు తరలించేందుకు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఒక బస్తా ఉల్లి (45కిలోలు) రూ.100 అమ్మేందుకు నాలుగు కౌంటర్లను యార్డులో ఏర్పాటు చేశామ న్నారు. మార్క్‌ఫెడ్‌ డీఎం రాజు, మార్కెట్‌ కమిటీ సెక్రెటరీ జయలక్ష్మి పోలీసు అధికా రులకు పలు సూచనలు చేశారు.

600ల క్వింటాళ్ల ఉల్లి అమ్మకం

మార్కెట్‌ కమిటీ సెలక్షన గ్రేడ్‌ సెక్రెటరీ జయలక్ష్మి

కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో 600ల క్వింటాళ్ల ఉల్లిని అమ్మినట్లు కర్నూలు మార్కెట్‌ కమిటీ సెలక్షన గ్రేడ్‌ సెక్రెటరీ జయలక్ష్మి తెలిపారు. ఆదివారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 1,250 బస్తాల ఉల్లిగడ్డలను వినియోగదారులకు విక్రయించామని, మరి కొంతమొత్తంలో రాష్ట్రంలోని రైతుబజార్లకు తరలించామన్నారు. సోమవారం నుంచి ఇప్పటిదాకా అమలైన క్వింటానికి రూ.1,200 మద్దతు ధర ఉండదని, రైతులు గమనిం చాలని విజ్ఞప్తిచేశారు. సీఎం ఉల్లి సాగు చేసిన ప్రతి రైతుకు హెక్టారుకు రూ.50వేల ఆర్థిక సాయాన్ని అందించేందుకు నిర్ణయించారని, అందువల్ల రూ.1,200ల మద్దతు ధర ఇక అమలులో ఉండదన్నారు. సమావేశంలో సెక్రటరీలు రెహిమాన, వెంకటేశ్వర్లు, సుందర్‌ రాజు, సూపర్‌వైజర్లు కేశవరెడ్డి, నాగేష్‌, శివన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2025 | 11:57 PM