EX HC Justice Rajani: సమాచార హక్కు చట్టంతో ప్రజాస్వామ్యం బలోపేతం
ABN , Publish Date - Oct 11 , 2025 | 04:49 AM
సమాచార హక్కు వంటి చట్టాలు ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరుస్తాయని ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని అన్నారు.
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రజని
మంగళగిరి సిటీ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): సమాచార హక్కు వంటి చట్టాలు ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరుస్తాయని ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని అన్నారు. సమాచార హక్కు చట్టం అమలై 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏపీ సమాచార కమిషన్ ఆధ్వర్యంలో ఆర్టీఐ వారోత్సవాలను శుక్రవారం మంగళగిరిలోని సమాచార శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ రజని మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రభుత్వానికి జవాబుదారీతనాన్ని పెంచుతుందని చెప్పారు.