ఆర్టీఐ చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయాలి: షర్మిల
ABN , Publish Date - Oct 13 , 2025 | 05:23 AM
ప్రధాని మోదీ గద్దెనెక్కిననాటి నుంచి సమాచార హక్కు చట్టానికి సమాధి కట్టారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ గద్దెనెక్కిననాటి నుంచి సమాచార హక్కు చట్టానికి సమాధి కట్టారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. సవరణ పేరుతో మేడిపండు చందంగా మార్చేశారని ఆదివారం ఒక ప్రకటనలో ఆమె ఆరోపించారు. ఓట్ల చోరీలాంటి దొంగ పనులు వెలుగులోకి రాకుండా ఆర్టీఐని కట్టడి చేశారని ఆక్షేపించారు. సామాన్య పౌరునికి పాశుపతాస్త్రంలాంటి సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వయం ప్రతిపత్తితో కూడిన స్వేచ్ఛాయుత సమాచార కమిషర్ల వ్యవస్థను పునరుద్ధరించాలని కోరారు.