Share News

RTC Employees: పనిష్మెంట్లు లేని పదోన్నతులు ఇవ్వాలి

ABN , Publish Date - Sep 03 , 2025 | 06:36 AM

పనిష్మెంట్లను పరిగణనలోకి తీసుకోకుండా ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని ఏపీపీటీడీ నేషనల్‌ మజ్దూర్‌యూనిటీ అసోసియేషన్‌ ఆంధ్రప్రదేశ్‌....

RTC Employees: పనిష్మెంట్లు లేని పదోన్నతులు ఇవ్వాలి

  • గతంలో కేసులు కొట్టివేయాలని ఏపీపీటీడీ ఎన్‌ఎంయూఏ విజ్ఞప్తి

విజయవాడ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పనిష్మెంట్లను పరిగణనలోకి తీసుకోకుండా ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని ఏపీపీటీడీ నేషనల్‌ మజ్దూర్‌యూనిటీ అసోసియేషన్‌ ఆంధ్రప్రదేశ్‌(ఎన్‌ఎంయూఏ) అధ్యక్షుడు పి.వి.రమణారెడ్డి కోరారు. విజయవాడలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును మంగళవారం యూనియన్‌ నాయకులతో కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అనంతరం రమణారెడ్డి మాట్లాడుతూ, పనిష్మెంట్లు పరిగణనలోకి తీసుకోకుండా పదోన్నతులు కల్పించే జీఓ ఆలస్యమవడంతో ప్రమోషన్లు ఆగిపోయాయని, వెంటనే జీఓ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సూపరింటెండెంట్‌ స్థాయి నుంచి ప్రమోషన్స్‌ ఇవ్వడానికి ప్రభుత్వ నుంచి రావాల్సిన అనుమతులు ఆలస్యమవడంతో ఎండీ దృష్టికి తీసుకువచ్చామన్నారు. దీనిపై ఎండీ సానుకూలంగా స్పందించారన్నారు. కోర్టు కేసులు క్లియర్‌చేసి త్వరగా జూనియర్‌ స్కేల్‌ అధికారులకు పదోన్నతులు ఇవ్వాలని కోరారు.

Updated Date - Sep 03 , 2025 | 06:36 AM