Share News

RTC Bus Accident: ఆర్టీసీ బస్సు బోల్తా.. 13 మందికి గాయాలు

ABN , Publish Date - Nov 29 , 2025 | 04:40 AM

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మద్దలకట్ట సమీపంలో గుంటూరు-కర్నూలు జాతీయ రహదారిపై ఏపీఎ్‌సఆర్టీసీ బస్సు శుక్రవారం బోల్తా పడింది...

RTC Bus Accident: ఆర్టీసీ బస్సు బోల్తా.. 13 మందికి గాయాలు

  • నూజివీడు నుంచి శ్రీశైలం వెళుతుండగా ప్రమాదం

పెద్దారవీడు, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా పెద్దారవీడు మద్దలకట్ట సమీపంలో గుంటూరు-కర్నూలు జాతీయ రహదారిపై ఏపీఎ్‌సఆర్టీసీ బస్సు శుక్రవారం బోల్తా పడింది. ప్రయాణికులు, స్థానికుల కథనం మేరకు.. ఏలూరు జిల్లా నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం నూజివీడు నుంచి శ్రీశైలం బయలుదేరింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మద్దలకట్ట సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారికి, గతంలో ఉన్న రహదారికి మధ్య మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 25 మందిలో 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వారిలో ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. ఎస్‌ఐ సాంబయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 29 , 2025 | 04:40 AM