Share News

RSS Leader Ram Lal Ji Meets Minister Lokesh: లోకేశ్‌తో ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రచారక్‌ రామ్‌లాల్‌జీ భేటీ

ABN , Publish Date - Nov 27 , 2025 | 05:22 AM

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎ్‌సఎస్‌) అఖిల భారతీయ సంపర్క్‌ ప్రముఖ్‌ రామ్‌లాల్‌జీ మంత్రి లోకేశ్‌తో భేటీ అయ్యారు....

RSS Leader Ram Lal Ji Meets Minister Lokesh: లోకేశ్‌తో ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రచారక్‌ రామ్‌లాల్‌జీ భేటీ

అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎ్‌సఎస్‌) అఖిల భారతీయ సంపర్క్‌ ప్రముఖ్‌ రామ్‌లాల్‌జీ మంత్రి లోకేశ్‌తో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని మంత్రి నివాసానికి బుధవారం రామ్‌లాల్‌జీ విచ్చేశారు. ఆయనకు లోకేశ్‌ స్వాగతం పలికారు. 2006 నుంచి 2019 వరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఆర్‌ఎ్‌సఎ్‌సలో వివిధ ఉన్నత హోదాల్లో పనిచేసిన రామ్‌లాల్‌జీ ఆర్‌ఎ్‌సఎస్‌ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖలతో సమావేశమవుతున్నారు. అందులో భాగంగా లోకేశ్‌తోపాటు పలువురు మంత్రులతోనూ భేటీ అయ్యారు. ఆయనను మంగళగిరి శాలువాతో లోకేశ్‌ సత్కరించారు. బాలల రాజ్యాంగ పుస్తకాన్ని బహూకరించారు. కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎన్‌ఎండీ ఫరూక్‌, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, ఎస్‌.సవిత, కొండపల్లి శ్రీనివాస్‌, మండిపల్లి రాంప్రసాద్‌, డోలా బాలవీరాంజనేయ స్వామి, ఆనం రాంనారాయణ రెడ్డి, సత్యకుమార్‌ యాదవ్‌, కొలుసు పార్థసారధి, వాసంశెట్టి సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2025 | 05:22 AM