Mohan Bhagwat: తిరుమల చేరుకున్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్
ABN , Publish Date - Dec 26 , 2025 | 04:32 AM
ఆర్‌ఎ్‌సఎస్ చీఫ్ మోహన్ భాగవత్ శ్రీవారి దర్శనార్థం గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు...
తిరుమల, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఆర్‌ఎ్‌సఎస్ చీఫ్ మోహన్ భాగవత్ శ్రీవారి దర్శనార్థం గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. గాయత్రి అతిథి గృహం వద్ద ఆయనకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం మోహన్ భాగవత్ క్షేత్ర సంప్రదాయాన్ని అనుసరిస్తూ ముందుగా వరాహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద భవనానికి చేరుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని ఆయన తిరుపతిలో జరిగే భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో పాల్గొంటారు.