Share News

Devichowk Temple: రూ.50 లక్షలతో దుర్గమ్మవారికి రథం

ABN , Publish Date - Oct 05 , 2025 | 04:02 AM

తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని దేవిచౌక్‌ ఆలయంలో మల్లేశ్వరస్వామి సమేత కనక దుర్గమ్మవారి ఊరేగింపునకు విశ్వ హిందూ ధర్మపరిరక్షణ...

Devichowk Temple: రూ.50 లక్షలతో దుర్గమ్మవారికి రథం

తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని దేవిచౌక్‌ ఆలయంలో మల్లేశ్వరస్వామి సమేత కనక దుర్గమ్మవారి ఊరేగింపునకు విశ్వ హిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు సుమారు రూ.50 లక్షలతో రథం తయారు చేయించారు. దసరా ఉత్సవాల్లో పూజలు చేయించి శనివారం రథాన్ని ఆలయం వద్దకు చేర్చారు. సుమారు ఆరు నెలలపాటు పలువురు శిల్పులు శ్రమించి, 4 టన్నుల టేకు, 4 టన్నుల సోమిది కర్ర, 3 టన్నుల ఇనుముతో రఽథాన్ని చేయించామని చెప్పారు.

- గోకవరం, ఆంధ్రజ్యోతి

Updated Date - Oct 05 , 2025 | 04:02 AM