Minister Kollu Ravindra: 400 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాం
ABN , Publish Date - Sep 30 , 2025 | 06:24 AM
పండుగ వేళ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు గొప్ప కానుక ప్రకటించింద ని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మాట్లాడారు.
పండుగ వేళ కానుక: కొల్లు
అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): పండుగ వేళ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు గొప్ప కానుక ప్రకటించింద ని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మాట్లాడారు. పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జగన్ వదిలిపోయిన బకాయిల్లో తాజాగా చెల్లించిన రూ. 400 కోట్లతో కలిపి మొత్తం రూ.1,788 కోట్లను తీర్చామని చెప్పారు. ఆర్థిక సమస్యల వలన ఏ విద్యార్థి చదువు ఆగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. పాత ఫీ జు రీయింబర్స్‌మెంట్ విధానం అమలు చేసి తల్లిదండ్రులపై భారాన్ని తగ్గించడమే కాకుండా.. విద్యార్థులకు అండగా నిలిచిన ఘనత సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు దక్కుతుందన్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు రా క ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కూటమి ప్రభుత్వం గుర్తించి చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఇప్పటికే 10 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు విడుదల అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
జగన్ పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.2,832 కోట్లు, వసతి దీవెన కింద రూ.989 కోట్లు, పీజీ ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద మరో రూ.450 బకాయిలు పెట్టారని, వాటన్నింటినీ దశలవారీగా చెల్లించుకుంటూ వస్తున్నామని తెలిపారు.