Minister TG Bharat: ఆహార పరిశ్రమ రంగంలో 10 వేల కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Sep 28 , 2025 | 04:33 AM
కూటమి ప్రభుత్వ కృషితో రాష్ట్ర ఆహార శుద్ధి రంగంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆహార శుద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
రాష్ట్ర ఆహార శుద్ధి, పరిశ్రమల మంత్రి టీజీ భరత్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ కృషితో రాష్ట్ర ఆహార శుద్ధి రంగంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆహార శుద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. పెట్టుబడుల రాకతో 20 వేల కొత్త ఉద్యోగాలు కూడా వచ్చాయన్నారు. శనివారం, భారత మండపంలో ప్రారంభమైన వరల్డ్ ఫుడ్ ఇండియా ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌ను మంత్రి సందర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు బ్రాండ్‌ను చూసి ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల కోసం మంచి పాలసీలను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఆహార పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేవారికి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి చెప్పారు.