Share News

AP government-RP Sisodia : సిసోడియా అవుట్‌

ABN , Publish Date - Apr 14 , 2025 | 02:43 AM

ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆర్‌.పీ. సిసోడియాను ప్రభుత్వం బదిలీ చేసి చేనేత-జౌళి శాఖకు పంపించింది. గత ప్రభుత్వం కాలంలో కీలకంగా ఉన్న ఐఏఎస్‌లకు కొత్తగా శాఖలు కేటాయిస్తూ తాజా పోస్టింగ్‌లు ఇచ్చింది.

AP government-RP Sisodia : సిసోడియా అవుట్‌

రెవెన్యూ నుంచి చేనేత-జౌళి శాఖకు బదిలీ

సీసీఎల్‌ఏ జయలక్ష్మికి అదనంగా రెవెన్యూ బాధ్యతలు

కాటమనేని భాస్కర్‌కు హెచ్‌ఆర్‌డీఐ అదనం

నిరీక్షణలో ఉన్న ఐదుగురు ఐఏఎ్‌సలకు పోస్టింగులు

ఎస్‌ఐఆర్‌డీ కమిషనర్‌గా ముత్యాలరాజు

రైతు బజార్ల సీఈవోగా మాధవీలత

నీలకంఠారెడ్డి ఎయిడ్స్‌ నియంత్రణకు

ఆయుష్‌ కమిషనర్‌గా దినేశ్‌కుమార్‌

గిరిజన గురుకులాల సొసైటీకి గౌతమి

అమరావతి, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.పి.సిసోడియాను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనపై పలు ఆరోపణలు రావడంతో చేనేత-జౌళి శాఖకు పంపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు కీలకమైన రెవెన్యూ, స్టాంప్స్‌-రిజిస్ట్రేషన్‌ శాఖలు అప్పగించింది. ఎంతో ప్రాధాన్యమిచ్చినా ఆయన నిలబెట్టుకోలేకపోయారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు వ్యక్తుల దందాలకు ఆయన సహకరించారని.. కొంత మందిని తన షేషీల్లో కూర్చోబెట్టుకుని మరీ ప్రోత్సాహించారన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా తన కింద పని చేసిన ఒక కీలక ఉద్యోగి వ్యవహారంలో ఆయన దురుసుగా ప్రవర్తించారన్న విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ పెద్దలు ప్రత్యేకంగా నిఘా విభాగంతో విచారణ చేయించారు. ఆ నివేదిక చూశాక ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైనా.. స్పెషల్‌ సీఎస్‌ స్థాయి అధికారి కావడంతో చేనేత-జౌళి శాఖకు బదిలీతో సరిపెట్టినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని శాఖల అదనపు బాధ్యతల నుంచి కూడా ఆయన్ను తప్పించారు. భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ), ప్రత్యేక సీఎస్‌ జయలక్ష్మికి అదనంగా రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించారు. అలాగే ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌కు మానవ వనరుల అభివృద్ధి సంస్థ (హెచ్‌ఆర్‌డీఐ) డైరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు కేటాయించారు.


ఎట్టకేలకు పోస్టింగ్స్‌..

జగన్‌ జమానాలో కీలకంగా వ్యవహరించిన కొంత మంది ఐఏఎ్‌సలను కూటమి ప్రభుత్వం రాగానే పక్కన పెట్టింది. దాదాపు పది మందికి పోస్టింగ్స్‌ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. అప్పటి నుంచి వారు పోస్టింగ్‌ కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు వారిలో కొందరికి శాఖలు కేటాయించింది. రేవు ముత్యాలరాజును పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి శాఖలో స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలె్‌పమెంట్‌ (ఎస్‌ఐఆర్‌డీ) కమిషనర్‌గా నియమించింది. ఏపీ రైతు బజార్ల సీఈవోగా కె.మాధవీలత, రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సొసైటీ ఎండీగా కె.నీలకంఠారెడ్డి, గిరిజన సంక్షేమ గురుకుల విద్య సొసైటీ కార్యదర్శిగా ఎం.గౌతమి, ఆయుష్‌ కమిషనర్‌గా కె.దినేశ్‌కుమార్‌ నియమితులయ్యారు. దినేశ్‌కుమార్‌ ఫైబర్‌నెట్‌ ఎండీగా ఉన్నప్పుడు ఆ కార్పొరేషన్‌ చైర్మన్‌ జీవీరెడ్డితో వివాదం రేగడం.. ఎండీపై ఆరోపణలు చేసిన జీవీరెడ్డి రాజీనామా చేయడం.. తదనంతరం దినేశ్‌కుమార్‌ను ప్రభుత్వం బదిలీచేయడం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..

TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 07:33 AM