రౌడీ రాజకీయాలకు తావు లేదు: నక్కా
ABN , Publish Date - Jun 15 , 2025 | 06:43 AM
రైతుల పరామర్శ పేరుతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ధ్వజమెత్తారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొదిలిలో పొగాకు రైతుల పేరుతో జగన్ నానా యాగీ చేశారు.
అమరావతి, జూన్ 14(ఆంధ్రజ్యోతి): రైతుల పరామర్శ పేరుతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ధ్వజమెత్తారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొదిలిలో పొగాకు రైతుల పేరుతో జగన్ నానా యాగీ చేశారు. రౌడీలు, సంఘ విద్రోహ శక్తులను పోగేసి, రైతుల పరామర్శకు వెళ్లారు. ‘ఎవడైనా రానీ, తొక్కి పడేస్తాం’ అంటూ ఫ్లెక్సీలు పెట్టుకుని ఎవరైనా రైతుల పరామర్శకు వెళ్తారా? పొదిలి యాత్రకు 40 వేల మంది వచ్చారని జగనే స్వయంగా ప్రకటించారు. రైతుల పరామర్శకు అంత మందిని కూడగట్టాల్సిన అవసరం ఏంటి? పొదిలిలో అరెస్టు అయిన వా రిలో 9 మందిపై ఉన్న కేసుల జాబితా పొదిలి ఓటర్ల జాబితా కన్నా పెద్దది. రాజకీయాల ముసుగులో రౌడీయిజం చేస్తుంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు. మాజీ సీఎంగా రౌడీ రాజకీయాలు చేస్తారా? తప్పు చేసిన వారిపై కూటమి ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది’ అని నక్కా స్పష్టం చేశారు.