Rotary Club Members: విధి వంచితుడికి రోటరీ చేయూత
ABN , Publish Date - Sep 01 , 2025 | 06:29 AM
హైదరాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో సీటు సంపాదించి ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన మాజీ క్రీడాకారుడు ఇఫ్రాయం దత్తుబాబుకు రోటరీ క్లబ్ సభ్యులు వితరణ ప్రకటించారు.
కదిలించిన ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు
గుంటూరు(విద్య), ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో సీటు సంపాదించి ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన మాజీ క్రీడాకారుడు ఇఫ్రాయం దత్తుబాబుకు రోటరీ క్లబ్ సభ్యులు వితరణ ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో వెన్నువిరిగి 16 ఏళ్లకే మంచానికి పరిమితమైన గుంటూరు హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఇఫ్రాయం దత్తుబాబు దీనస్థితి గురించి ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’, ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’లో చూసి చలించిపోయామని సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం దత్తు బాబు కుటుంబాన్ని ఆయన ఇంటి వద్ద కలిసి రూ.50,000 ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు అచీవర్స్ అధ్యక్షుడు కొండపనేని విజయకృష్ణ, కార్యదర్శి గోనుగుంట్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు. కాగా, దత్తుబాబు తల్లి రూత్‌రాణి మాట్లాడుతూ కుమారుడికి ఇంకా రెండు పెద్ద సర్జరీలు జరగాల్సి ఉందని, సాయం చేసేవారు 9000980948 నంబరుకు ఫోన్‌పే/గూగుల్ పే చేయాలని కోరారు. బ్యాంకు ఖాతాలో జమ చేయాలనుకునేవారు ‘దుగ్గిరాల ఇఫ్రాయం దత్తుబాబు, ఎస్‌బీఐ ఖాతా నంబరు 62487417417, ఐఎఫ్‌సీ కోడ్ ఎస్‌బీఐఎన్0021263’కు పంపాలని విజ్ఞప్తి చేశారు.