Share News

Roshni Korati: విశాఖ పోర్టు డిప్యూటీ చైర్‌పర్సన్‌గా రోష్ని

ABN , Publish Date - Dec 30 , 2025 | 04:32 AM

విశాఖపట్నం పోర్టు అథారిటీ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా రోష్ని అపరంజి కోరాటి సోమవారం బాధ్యతలు స్వీకరించారు..

Roshni Korati: విశాఖ పోర్టు డిప్యూటీ చైర్‌పర్సన్‌గా రోష్ని

  • తొలిసారిగా మహిళా ఐఏఎస్‌ నియామకం

విశాఖపట్నం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం పోర్టు అథారిటీ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా రోష్ని అపరంజి కోరాటి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ స్థానంలో నియమితులైన తొలి మహిళా ఐఏఎస్‌ ఆమె. అసోం-మేఘాలయ క్యాడర్‌కు చెందిన రోష్ని స్వస్థలం విశాఖపట్నమే. తండ్రి విశాఖపట్నం పోర్టు హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. తండ్రి పనిచేసిన సంస్థలోనే డిప్యూటీ చైర్‌పర్సన్‌ హోదాలో ఆమె బాధ్యతలు చేపట్టడంపై పోర్టు ఉద్యోగులంతా హర్షిస్తున్నారు. 1984 ఏప్రిల్‌ 3న జన్మించిన రోష్ని ఏయూలో జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసి గోల్డ్‌మెడల్‌ సాధించారు. అనంతరం సివిల్‌ సర్వీసె్‌సకు ఎంపికయ్యారు. అసోంలోని జోర్హాట్‌ జిల్లా అదనపు ఉప కమిషనర్‌గా, తర్వాత అదే జిల్లాకు కలెక్టర్‌గా సేవలందించారు. ప్రజాపరిపాలనలో విశిష్ట సేవలకుగాను 2018లో ప్రధాని అవార్డు అందుకున్నారు.

Updated Date - Dec 30 , 2025 | 04:32 AM