Share News

రోడ్డు పక్కన చెత్త తొలగింపు

ABN , Publish Date - Jul 29 , 2025 | 11:59 PM

పత్తూరు కాశిరెడ్డినాయన సమీపంలో రోడ్డుపై వేసిన చెత్తను పత్తూరు సెక్రటరి శంకరమ్మ తొలగింపజేశారు.

రోడ్డు పక్కన చెత్త తొలగింపు
చెత్తను తొలగించిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సెక్రటరి

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

ఖాజీపేట, జూలై 29 (ఆంధ్రజ్యోతి): పత్తూరు కాశిరెడ్డినాయన సమీపంలో రోడ్డుపై వేసిన చెత్తను పత్తూరు సెక్రటరి శంకరమ్మ తొలగింపజేశారు. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘తీరు మారదు - శుభ్రత కనిపించదు’ అన్న శీర్షికన కథనం రావడంతో సెక్రటరీ స్పందించి ఎక్స్‌కవేట ర్‌తో చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా సెక్రటరి మాట్లాడుతూ రోడ్డుపై చెత్త వేసిన హరిత రాయబారిని వివరణ కోరడం జరిగిందని, అలాగే హోటల్‌వారు కూడా చెత్త వేయడంతో ఆ ప్రాంతం నిండిపోయిందని మొత్తం చెత్తను తొలగించడం జరిగిందన్నారు. ఎవరైనా చెత్త వేశారని తెలిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని, ప్రజలు సహకరించాలని, హరితరాయభారికి మాత్రమే చెత్తను అందించాలన్నారు.

Updated Date - Jul 29 , 2025 | 11:59 PM