ఫైౖబర్ టెక్నాలజీతో రోడ్డు నిర్మాణం
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:55 PM
గ్రామీణ ప్రాంతా లలోని రోడ్డు నాణ్యతగా ఉండేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అత్యాదునికమైన ఫైబర్ టెక్నాలజీతో రోడ్ల నిర్మాణాలు చేపట్టిందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
ఎమ్మెల్యే గిత్తా జయసూర్య
నందికొట్కూరు - పగిడ్యాల
బీటీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
పగిడ్యాల, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతా లలోని రోడ్డు నాణ్యతగా ఉండేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అత్యాదునికమైన ఫైబర్ టెక్నాలజీతో రోడ్ల నిర్మాణాలు చేపట్టిందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. నందికొట్కూరు- పగిడ్యాల బీటీ రోడ్డు నిర్మాణానికి సోమవారం పగిడ్యాల విద్యుత సబ్‌స్టేషన వద్ద ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు, రోడ్డు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి దేశంలోనే మొదటిసారిగా అత్యాదునిక ఫైబర్ టెక్నాలజీతో రోడ్డు నిర్మాణాలు చేపట్టారన్నారు. గార్గేయపురం- మిడుతూరుకు వెళ్లే రహదారికి గతంలో నిధులు మంజూరుకాగా, నిర్లక్ష్యం వహించారన్నారు. నిర్మాణానికి టెండర్లు పిలిచి భూమిపూజ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. లక్ష్మాపురం నుంచి ప్రాతకోట, ఎన. ఘనపురం, నెహ్రూనగర్ గ్రామాలకు వెళ్లే రహదారుల నిర్మాణాల కోసం ప్రతిపాదనలు పంపుతామన్నారు. పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టరును ఆదేశించారు. కార్యక్రమంలో డీఈ మనోధర్‌రెడ్డి, ఎంపీడీవో సుమిత్రమ్మ, డిప్యూటీ తహసీల్దార్ మధు, యాదవ కార్పొరేషన డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్, మహేశ్వరరెడ్డి, సొసైటీ చైర్మన దామోదర్‌రెడ్డి, పుల్యాల రాజశేఖర్‌రెడ్డి, వాసురెడ్డి, మద్దిలేటి గౌడ్, షమీన, అయ్యన్న, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
టెక్నాలజీపై అవగాహన ఉండాలి
నందికొట్కూరు: విద్యార్థులకు టెక్నాలజీపై అవగాహన ఉండాలని ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. సోమవారం పట్టణంలోని శ్రీ విజ్ఞాన జూనియర్ కళాశాల , వేదాంత సంయుక్తంగా అత్యాధునికమైన వేదాంత లెర్నింగ్ సెంటర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సాంకేతికత కలిగిన చదువుల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, టీడీపీ నాయకులు లాయర్ జాకీర్, వేణుగోపాల్, టౌన, రూరల్ సీఐలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం, శ్రీ విజ్ఞాన జూనియర్ కళాశాల కరస్పాండెంట్ గాంధీ నాయుడు, డైరెక్టర్ డా.వినోద్ కుమార్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నియోజకవర్గ అధ్యక్షులు నర్సరాజు పాల్గొన్నారు.