Share News

Meteorological Department: రాష్ట్రంలో పెరుగుతున్న చలి

ABN , Publish Date - Nov 09 , 2025 | 05:59 AM

బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి.

Meteorological Department: రాష్ట్రంలో పెరుగుతున్న చలి

విశాఖపట్నం, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పగటిపూట ఎండ కొనసాగడంతోపాటు పొడి వాతావరణం నెలకొంది. మరోవైపు ఉత్తర, మధ్య భారతంలో రాత్రిపూట చలి ఒక్కసారిగా పెరిగింది. ఆ ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల చలి పెరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో శనివారం 14.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు, మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఈనెల రెండో వారం తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు.

Updated Date - Nov 09 , 2025 | 05:59 AM