Cold Temperature: కోస్తా, సీమలో పెరగనున్న చలి
ABN , Publish Date - Nov 08 , 2025 | 06:09 AM
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. దక్షిణ కోస్తాలో కొద్ది ప్రాంతాలకు తప్ప మిగిలిన ప్రాంతాలకు బంగాళాఖాతం నుంచి తేమ...
జి.మాడుగులలో 15.1 డిగ్రీలు నమోదు
విశాఖపట్నం, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. దక్షిణ కోస్తాలో కొద్ది ప్రాంతాలకు తప్ప మిగిలిన ప్రాంతాలకు బంగాళాఖాతం నుంచి తేమ గాలుల రాక నిలిచిపోయింది. దీంతో వాయువ్య భారతం నుంచి పొడి గాలులు మధ్యభారతం, ఒడిశా మీదుగా కోస్తా వరకూ వీస్తున్నాయి. ఈ ప్రభావంతో శుక్రవారం ఉదయం ఉత్తర కోస్తా, తెలంగాణకు ఆనుకుని కోస్తాలో పలుచోట్ల చలి పెరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 15.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల పొడి వాతావరణం నెలకొనగా, కొద్దిచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న రెండు, మూడు రోజులు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య భారతం నుంచి వీస్తున్న గాలులతో కోస్తా, రాయలసీమల్లో చలి ప్రభావం ఉంటుందని పేర్కొంది.