Goa Governor Ashok Gajapathi Raju: రుషికొండ ప్యాలెస్‌ను పిచ్చాసుపత్రిగా మారిస్తే మంచిది
ABN , Publish Date - Sep 04 , 2025 | 05:29 AM
నగరంలోని రుషికొండపై రూ.వందల కోట్ల ఖర్చుతో నిర్మించిన భవనం వల్ల ఆదాయమేమీ రాదు. దానిని పిచ్చాసుపత్రి చేస్తే మంచిది అని గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు.
గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు
విశాఖపట్నం, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ‘నగరంలోని రుషికొండపై రూ.వందల కోట్ల ఖర్చుతో నిర్మించిన భవనం వల్ల ఆదాయమేమీ రాదు. దానిని పిచ్చాసుపత్రి చేస్తే మంచిది’ అని గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. ఏపీలోని విశాఖలో సీతమ్మధార కల్యా ణ మంపడంలో బుధవారం క్షత్రియ సంక్షేమ సమితి సభ్యులు ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా అశోక్‌గజపతిరాజు మాట్లాడారు. ‘రుషికొండ ప్యాలె్‌సను ఏమి చేస్తే బాగుంటుంది? అని ప్రభుత్వం ప్రజాభిప్రాయం అడుగుతోంది కాబట్టి నేను ఉచిత సలహా ఇస్తున్నా. అక్కడ ఎవరిని బస చేయమ న్నా నిద్ర కూడా పట్టదు. అందుకే పిచ్చి ఆస్పత్రిగా మార్చాలి. అన్ని రూ. కోట్లు పెట్టి నిర్మించిన భవనం పెచ్చులు ఊడిపోతున్నాయని తెలిసి బాధ కలిగింది. ఆ రూ.600 కోట్లు ఖర్చు చేస్తే ఉత్తరాంధ్రాకు అవసరమైన సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తయ్యేది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సైకో ముఖ్యమంత్రికి తప్పకుండా సముద్రపు గాలి తగులుతుంది’ అని అన్నారు.