Bhimavaram: రిటైర్డ్ మునిసిపల్ ఎంప్లాయీస్
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:59 AM
రిటైర్డు మునిసిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవూరి గోగురాజు (భీమవరం) ఎన్నికయ్యారు.
అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా గోగురాజు
భీమవరంటౌన్, డిసెంబరు14(ఆంధ్రజ్యోతి): రిటైర్డు మునిసిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవూరి గోగురాజు (భీమవరం) ఎన్నికయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆదివారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా డీవీఎస్ఎన్ మూర్తిమురళి (కాకినాడ), ఉపాధ్యక్షులు గా సీహెచ్. హరిబాబు(గుంటూరు), ఎంవీ నారాయణరెడ్డి(రాజమండ్రి), బి.మునుస్వామి(అనంతపురం), పీవీటీ రమణారావు (విశాఖపట్నం), కోశాధికారిగా జి.వేణుగోపాలస్వామి (తుని), ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె. సత్యనారాయణ (కాకినాడ), జె.శ్యామ్‌రాజ్ (అనంతపురం), రీజినల్ సెక్రటరీలుగా ఎంవీ రామారావు (రాజమండ్రి), బి.వెంకటరామయ్య (అనంతపురం)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా రిటైర్డు ప్రభుత్వ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పీఎస్ఎస్ఎన్‌పీ శాస్త్రి వ్యవహరించారు.