Share News

ఘనంగా పెద్దమ్మ దేవర

ABN , Publish Date - Jun 10 , 2025 | 12:03 AM

జిల్లాలో ఎంతో విశిష్టత ఉన్న డబ్ల్యూ.గోవిందిన్నె గ్రామంలో వెలసిన గ్రామదేవత మూలపెద్దమ్మ దేవర సోమవారం వైభవంగా నిర్వహించారు.

ఘనంగా పెద్దమ్మ దేవర
మూలపెద్దమ్మ

అమ్మవారిని దర్శించుకున్న మంచు మనోజ్‌ దంపతులు

దొర్నిపాడు, జూన 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎంతో విశిష్టత ఉన్న డబ్ల్యూ.గోవిందిన్నె గ్రామంలో వెలసిన గ్రామదేవత మూలపెద్దమ్మ దేవర సోమవారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని ఆళ్లగడ్డ ఎమ్మె ల్యే భూమా అఖిలప్రియ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 11 సంవత్సరాల తరువాత దేవర జరగడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, అధిక సంఖ్యలో తరలి వచ్చారు. గ్రామంలో ప్రతి ఇళ్లు బంధువులతో కళకళలా డింది. మహిళలు అధిక సం ఖ్యలో బోనా లు నెత్తిన పెట్టుకొని అ మ్మవారికి సమ ర్పించారు. అర్ధ రాత్రి తరువాత దేవర పోతురాజుతో గ్రామంలో ఊరేగింపు చేశారు. గ్రామస్థులు పెద్దమ్మకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో డిసి్ట్రబ్యూటరీ కమిటీ చైర్మన ఏరువ ప్రసాద్‌రెడ్డి, నంద్యాల పార్లమెంట్‌ రైతు సంఘం అధ్యక్షుడు సిద్ధి సత్యనారాయణ, మహేశ్వర్‌రెడ్డి, గంగవరం కృష్ణారెడ్డి, అంజి తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారి సన్నిధిలో మంచు మనోజ్‌ దంపతులు

సినీ నటుడు మంచుమనోజ్‌, ఆయన భార్య భూమా మౌనిక అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి మండల మాజీ అధ్యక్షుడు భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా సంతోష్‌రెడ్డి, సందిప్‌రెడ్డి ఆహ్వానించారు.

Updated Date - Jun 10 , 2025 | 12:03 AM