Share News

BTech Ravi: రాజీనామా చేసి రా.. జగన్‌..

ABN , Publish Date - Aug 21 , 2025 | 05:32 AM

పులివెందుల ప్రజలు జగన్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంత వరకు అసెంబ్లీకి రాలేదు. పులివెందుల సమస్యల గురించి...

BTech Ravi: రాజీనామా చేసి రా.. జగన్‌..

అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ‘పులివెందుల ప్రజలు జగన్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంత వరకు అసెంబ్లీకి రాలేదు. పులివెందుల సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. ఇక పులివెందుల ప్రజలు జగన్‌కు ఎందుకు ఓటు వేస్తారు?’ అని టీడీపీ నేత మారెడ్డి రవీంద్రనాథ్‌ రెడ్డి(బీటెక్‌ రవి) ప్రశ్నించారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని ఆరోపిస్తున్న జగన్‌... ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వస్తే పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడదామని రవి సవాల్‌ విసిరారు.

Updated Date - Aug 21 , 2025 | 05:32 AM