Reservoirs Are Near Full Capacity: నిండుకుండల్లా ప్రాజెక్టులు
ABN , Publish Date - Sep 14 , 2025 | 03:13 AM
రాష్ట్రంలో ప్రధాన జలాశయాలన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. నీటి నిల్వ..లు దాదాపుగా గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో
ప్రధాన జలాశయాల్లోకి పెరిగిన వరద
అమరావతి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రధాన జలాశయాలన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. నీటి నిల్వలు దాదాపుగా గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు లేకున్నా.. ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 215.81 టీఎంసీలకు గాను 97,55 శాతం అంటే.. 210.51 టీఎంసీలు ఉన్నాయి. శ్రీశైలం జలాశయంలోకి ఎగువ నుంచి 2,60,659 క్యూసెక్కుల వరద వస్తుండగా, దిగువకు 2,54,279 క్యూసెక్కులు వదులుతున్నారు. నాగార్జునసాగర్ గరిష్ఠ నీటి నిల్వ 312.05 టీఎంసీలకు గాను 99.62 శాతం అంటే.. 310.61 టీఎంసీలు ఉన్నాయి. ప్రాజెక్టులోకి 1,97,564 క్యూసెక్కుల వరద వస్తుండగా, దిగువకు అదే స్థాయిలో వదులుతున్నారు. పులిచింతల సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను 90.86 శాతం.. 41.59 టీఎంసీల జలాలు నిల్వ ఉన్నాయి. పులిచింతలకు 1,24,790 క్యూసెక్కుల వరద వస్తుండగా, కిందకు 1,29,393 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీ గరిష్ఠ నీటి నిల్వ 3.07 టీఎంసీలకు గాను 100 వంద శాతం నిండిపోయింది. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న 1,42,293 క్యూసెక్కుల జలాలను వచ్చినట్లుగానే విడిచిపెడుతున్నారు.