Minister Dola: సచివాలయ వ్యవస్థకు కొత్త పేరు..
ABN , Publish Date - Nov 07 , 2025 | 04:25 AM
ప్రజల కోరిక మేరకు గ్రామ సచివాలయాల పేరు మార్చుతున్నామని, సచివాలయ వ్యవస్థకు ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన పేరు పెట్టబోతున్నామని...
ప్రజలందరూ ఆమోదించేలా నిర్ణయం: మంత్రి డోలా
అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రజల కోరిక మేరకు గ్రామ సచివాలయాల పేరు మార్చుతున్నామని, సచివాలయ వ్యవస్థకు ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన పేరు పెట్టబోతున్నామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి గురువారం తెలిపారు. సచివాలయ వ్యవస్థలో జిల్లా, మండల, గ్రామ స్థాయిలో మూడు అంచెల వ్యవస్థను తీసుకొస్తున్నామన్నారు. ప్రజల వద్దకే పాలనను పరిచయం చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్న విషయం ‘నీలి మీడియా’ గుర్తించుకోవాలన్నారు. దీన్ని క్రెడిట్ చోరీ అనడం సిగ్గుచేటన్నారు.
‘విజన్ యూనిట్ కాదు..’ సీఎం కార్యాలయం వివరణ
గ్రామ, వార్డు సచివాలయాల పేరును విజన్ యూనిట్లుగా మార్చారని వస్తున్న వార్తలు అవాస్తవమని ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇచ్చింది. 2047 స్వర్ణాంధ్ర విజన్ లక్ష్య సాధన కోసం విజన్ యూనిట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు పనిచేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారని, అంతేతప్ప వాటి పేరను విజన్ యూనిట్లుగా మార్చలేదని పేర్కొంది.