ACB Court: లిక్కర్ కేసు నిందితులకు 9 వరకు రిమాండ్ పొడిగింపు
ABN , Publish Date - Aug 27 , 2025 | 06:49 AM
మద్యం కేసులో నిందితులకు రిమాండ్‌ను సెప్టెంబరు 9 వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ కేసులో వివిధ జైళ్లలో ఉన్న 12 మంది నిందితులను పోలీసులు కోర్టులో సోమవారం హాజరుపరిచారు.
ఏసీబీ కోర్టు ఉత్తర్వులు
కోర్టులో వాదనలు వినిపించిన నిందితులు
విజయవాడ, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): మద్యం కేసులో నిందితులకు రిమాండ్‌ను సెప్టెంబరు 9 వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ కేసులో వివిధ జైళ్లలో ఉన్న 12 మంది నిందితులను పోలీసులు కోర్టులో సోమవారం హాజరుపరిచారు. వారికి రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులిచ్చారు. అంతకుముందు కోర్టుకు రాజ్ కసిరెడ్డి తన వాదనను వినిపించారు. సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ. 11 కోట్లు తనవే అయితే వాటిపై తన వేలిముద్రలు ఉంటాయన్నారు. రాజమండ్రి జైలు నుంచి విజయవాడ కోర్టుకు వచ్చే దారిలో సిబ్బంది ఫోన్‌తో తన కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు అనుమతించాలని మిథున్‌రెడ్డి అభ్యర్థించారు. దీనిని న్యాయాధికారి తోసిపుచ్చారు. కాగా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పును 30వ తేదీ వెలువరిస్తామని న్యాయాధికారి తెలిపారు.