ACB Court: ఐపీఎస్ సంజయ్‌కు రిమాండ్ పొడిగింపు
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:32 AM
అగ్నిమాపక శాఖలో నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్, ఏ4 బిక్కిన కొండలరావులకు ఈనెల 17వ తేదీ వరకు రిమాండ్ పొడిగించారు.
అగ్నిమాపక నిధుల దుర్వినియోగం కేసులో కొండలరావుకు కూడా..
విజయవాడ, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): అగ్నిమాపక శాఖలో నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్, ఏ4 బిక్కిన కొండలరావులకు ఈనెల 17వ తేదీ వరకు రిమాండ్ పొడిగించారు. విజయవాడలోని ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు ఈ ఆదేశాలిచ్చారు. కాగా, గతనెల 18వ తేదీన విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో పట్టుబడిన మావోయిస్టులు పొడియా బీమా అలియాస్ రంగు, మడకం లక్మ అలియాస్ మదన్, మడవి చిన్మయ్ అలియాస్ మనీలా, మంగి డొక్కుపాడిలకు ఈనెల 16వ తేదీ వరకు రిమాండ్ పొడిగించారు.