Share News

జీఎస్టీ తగ్గింపుతో ఉపశమనం

ABN , Publish Date - Oct 10 , 2025 | 11:49 PM

జీఎస్టీ తగ్గింపుతో పేద, మద్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగిందని కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు.

జీఎస్టీ తగ్గింపుతో ఉపశమనం
ఎలక్ర్టానిక్‌ పరికరాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి , అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : జీఎస్టీ తగ్గింపుతో పేద, మద్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగిందని కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని టౌనహాల్‌లో నిర్వహించిన జీఎస్టీ ఉత్సవ్‌ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన కట్‌ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫ్రిజ్‌, టీవీ, డిష్‌వాషర్‌, ఎలక్ర్టానిక్‌ పరికరాలను వీక్షించారు. వ్యాపార తీరును ఆమె అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ ఎలక్ర్టానిక్‌ వస్తువులపై జీఎస్టీ 10 శాతం తగ్గిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమీషనర్‌ శేషన్న, నంద్యాల జీఎస్టీ అసిస్టెంట్‌ కమీషనర్లు లక్ష్మీనాయక్‌, చందనహర్ష, డీసీటీవోలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 11:49 PM