Share News

Election Code Violation: మోహన్‌బాబుకు సుప్రీంలో ఊరట

ABN , Publish Date - Aug 01 , 2025 | 06:19 AM

ప్రముఖ సినిమా నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019లో ఆయన ఎన్నికల కోడ్‌ను...

Election Code Violation: మోహన్‌బాబుకు సుప్రీంలో ఊరట

న్యూఢిల్లీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినిమా నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019లో ఆయన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ నమోదైన కేసును సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసింది. తన విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని కోరుతూ తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారిపై విద్యార్థులతోపాటు మంచు కుటుంబం ధర్నాకు దిగింది. అప్పటికే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో ఆయనతో పాటు కుమారులు విష్ణు, మనోజ్‌, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొసీడింగ్స్‌ అన్నింటినీ కొట్టివేస్తున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది.

Updated Date - Aug 01 , 2025 | 06:20 AM