Share News

క్రీడలతో మానసికోల్లాసం

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:35 PM

క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనఎండీ ఫిరోజ్‌ అన్నారు.

క్రీడలతో మానసికోల్లాసం
జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులతో ముఖ్య అతిథులు

టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్‌

నంద్యాల హాస్పిటల్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనఎండీ ఫిరోజ్‌ అన్నారు. మంగళవారం పట్టణం నూనెపల్లె మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో ఎస్‌జీఎఫ్‌ డివిజన స్థాయి బాలుర ఆటలపోటీలు హెచఎం చలపతిరావు అధ్యక్షతన డివిజన కార్యదర్శి శివకుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనఎండి ఫిరోజ్‌ హాజరై పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నంద్యాలలో జరిగే ప్రతి ఆటలపోటీలకు తనవంతు సహాయసహకారాలు అందిస్తామన్నారు. నంద్యాలలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు రోడ్‌మ్యాప్‌ తయారైందని త్వరలోనే అమలు చేస్తామన్నారు. మున్సిపల్‌ పాఠశాల క్రీడా మైదానం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో నంద్యాల డివిజనలోని 13మండలాల నుంచి దాదాపు 500మంది బాలురు పాల్గొన్నట్లు డివిజన కార్యదర్శి వి.శివకుమార్‌ తెలిపారు. విద్యార్థులకు అండర్‌-17, 14 వాలీబాల్‌, ఖోఖో, అథ్లెటిక్స్‌లలో పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ వార్డు ఇనచార్జి నాయుడు, మహమ్మద్‌రఫీ, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి బత్తులరవి, వ్యాయామ ఉపాధ్యాయులు శేషు, రాజునాయక్‌, శ్రీనివాసరెడ్డి, ముజాహిద్‌, విజయ్‌, భరత, శశికళ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 11:35 PM