మృతదేహంతో బంధువుల ఆందోళన
ABN , Publish Date - Mar 18 , 2025 | 12:31 AM
ఆదోని మండలం నాగలాపురం గ్రామస్థులు వీరేష్ (30) మృతదేహంతో ఆందోళన చేపట్టారు.
ఆదోని, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఆదోని మండలం నాగలాపురం గ్రామస్థులు వీరేష్ (30) మృతదేహంతో ఆందోళన చేపట్టారు. 2025 మార్చి 13వ తేదీన ఆదోని సమీపంలో ట్రాక్ట్‌ర్, కారు ఢీకొన్న ప్రమాదంలో కురువ వీరేష్ (30) తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందాడు. వీరేష్‌కు భార్య సుజాతతో పాటు ఐదుగురు ఆడబిడ్డలు ఉన్నారని, వారికి న్యాయం చేయాలని కోరారు. ఇంటికి పెద్ద దిక్కున కోల్పోవడంతో ఆ ఇంటిల్లిపాది బతికేది కష్టమని, అలాంటి సమయంలో పిల్లలకు ఏదైనా సహాయం అందించాలంటూ వీరేష్ శవంతో గ్రామస్థులు స్థానిక విముల రేజెన్సీ దగ్గర ఆందోళన చేపట్టారు. అనంతరం నిర్వాహకులు వేముల రెడ్డి వారు కుటుంబ సభ్యులకు ఆర్థికంగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.