Share News

బయో వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Oct 25 , 2025 | 11:47 PM

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రు లు, ల్యాబ్‌లు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణలో నిబంధనల ను కచ్చితంగా పాటించాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు.

 బయో వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించాలి
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

పోస్టర్‌ ఆవిష్కరణ

నంద్యాల నూనెపల్లి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రు లు, ల్యాబ్‌లు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణలో నిబంధనల ను కచ్చితంగా పాటించాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ చాంబర్‌లో కాలుష్య నియంత్రణ చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. రోగులు, సిబ్బంది, ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా వైద్య వ్యర్థాలను సక్రమంగా వేరు చేసి శాస్త్రీయ పద్ధతిలో నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఆసుపత్రులలో కాలం చెల్లిన మందులను సక్ర మంగా ధ్వంసం చేయాలన్నారు. అలాంటి మందులను సాధారణ చెత్తతో కలిపి పారబోస్తే పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ముప్పు కలుగు తుందని హెచ్చరించారు. రెడ్‌, ఎల్లో, బ్లూ, వైట్‌ రంగుల బయో కోడింగ్‌ బ్యాగులు ఉపయోగించి ఇంజక్షన సూదులు, పత్తి, గ్లౌవ్స్‌, శరీర వ్యర్థాలు తదితర బయో మెడికల్‌ వ్యర్థాలను వేరు చేయాలన్నారు. అలాగే ప్రతి ఆసుపత్రి, క్లినిక్‌, ల్యాబ్‌ తమ వద్ద ఉత్పత్తి అయ్యే వ్యర్థాల వివరాలను బయో మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యాప్‌లో ప్రతిరోజూ ఎంట్రీ చేయాలన్నారు. డేటా ఎంట్రీ చేయని సంస్థలపై కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకోవాలని ఆమె సంబంధిత అఽధికారులను ఆదేశించారు. సమీక్ష అనంతరం కలెక్టర్‌ ‘చెత్తను వేరు చేసే ముందు ఆలోచించండి’ అనే వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిం చా రు. కార్యక్రమంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కిశోర్‌, జిల్లా వైద్య ఆరోగ్య అధి కారి డాక్టర్‌ వెంకటరమణ, డీసీహెచఎస్‌ డాక్టర్‌ లలిత, పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 11:47 PM