Andhra Pradesh High Court: హెచ్‌సీఈఏ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వండి
ABN , Publish Date - Aug 21 , 2025 | 06:04 AM
ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నికలనిర్వహణకు తక్షణమే మరో నోటిఫికేషన్ జారీ చేయాలని రిజిస్ట్రార్ జనరల్ వైవీఎ్‌సబీ..
ఎన్నికల అధికారికి రిజిస్ట్రార్ జనరల్ సూచన
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నికలనిర్వహణకు తక్షణమే మరో నోటిఫికేషన్ జారీ చేయాలని రిజిస్ట్రార్ జనరల్ వైవీఎ్‌సబీ పార్థసారథి ఎన్నికల అధికారికి సూచించారు. ఎన్నికల నిర్వహణకు ఈనెల 13న ఇచ్చిన నోటిఫికేషన్‌ను విస్మరించాలని ఎన్నికల అధికారికి తెలిపారు. ఈనేపథ్యంలో ఎన్నికల అధికారిగా తాను కొనసాగలేనని, బాధ్యతల నుంచి తక్షణమే రిలీవ్ చేయాలని ఎన్నికల అధికారి సూర్యానంద రెడ్డి కోరినట్లు బుధవారం ఆర్‌జీ జారీ చేసిన మెమోరాండంలో పేర్కొన్నారు.