Visakhapatnam: తగ్గిన వర్షాలు.. పెరగనున్న చలి
ABN , Publish Date - Dec 06 , 2025 | 06:40 AM
దిత్వా తుఫాన్ బలహీనపడడంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గాయి, దీంతో ఉత్తరాది నుంచి చలిగాలుల తీవ్రత పెరిగింది.
అల్లూరి జిల్లాలో 11.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
విశాఖపట్నం, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘దిత్వా’ తుఫాన్ బలహీనపడడంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గాయి, దీంతో ఉత్తరాది నుంచి చలిగాలుల తీవ్రత పెరిగింది. ఏజెన్సీ, ఉత్తరాంధ్ర, తెలంగాణను ఆనుకుని ఉన్న కోస్తా ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. శుక్రవారం అల్లూరి జిల్లా దళపతిగూడలో 11.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, సీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.