Share News

రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:28 AM

రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు అన్నా రు.

రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
జొన్న పంటను పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు

జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు

గోస్పాడు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు అన్నా రు. బుధవారం జిల్లెల్ల గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువులు వాడటం వల్ల భూమి నిస్సారమైపోతుందని, వాటిని తగ్గించి సేంద్రియ జీవన ఎరువులను వాడాలని రైతులకు సూచించారు. దీనివల్ల భూమి, మానవాళి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని అన్నారు. 25రోజుల దశలో ఉన్న జొన్న పైరును పరిశీలించి మొక్క పెరుగుదలకు ఫార్ములా-4 మైక్రోన్యూట్రియన్స, మల్టీ కె స్ర్పే చేయాలని రైతులకు సూచించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించాలని, వాణిజ్య పంటలు, చిరుధాన్యాలను సాగుచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ విజయశేఖర్‌, ఏవో స్వప్నిక, వెటర్నరీ డాక్టర్‌ అభిలాష్‌, ఏఈవోలు రామకృష్ణ, నాగార్జున, దివాకర్‌రెడ్డి, గ్రామ రైతులు చంద్రశేఖర్‌రెడ్డి, సదాశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 12:29 AM