Share News

AP Lok Adalat: లోక్‌ అదాలత్‌లకు విశేష స్పందన

ABN , Publish Date - Jul 06 , 2025 | 04:05 AM

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్‌ అదాలత్‌లకు విశేష స్పందన లభించింది. శనివారం ఒక్కరోజే 78,168 కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం రూ.63 కోట్ల పరిహారం అందజేశారు.

AP Lok Adalat: లోక్‌ అదాలత్‌లకు విశేష స్పందన

  • ఒక్కరోజే 78,168 కేసుల పరిష్కారం

అమరావతి, జూలై 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్‌ అదాలత్‌లకు విశేష స్పందన లభించింది. శనివారం ఒక్కరోజే 78,168 కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం రూ.63 కోట్ల పరిహారం అందజేశారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాల్లో 411 లోక్‌ అదాలత్‌ బెంచ్‌లు నిర్వహించారు. ఇరువర్గాల ఆమోదంతో రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించారు. ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లోక్‌ అదాలత్‌లో న్యాయమూర్తులు జస్టిస్‌ అవధానం కుంచం మహేశ్వరరావు, జస్టిస్‌ వై.లక్ష్మణరావు పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న135 కేసులు పరిష్కరించి రూ.3.85 కోట్ల పరిహారం అందజేశారు. లోక్‌ అదాలత్‌లు విజయవంతం కావడానికి సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, అధికారులకు ఏపీ న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి, ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీ ఇన్‌చార్జ్‌ కార్యదర్శి బీఎ్‌సవీ హిమబిందు కృతజ్ఙతలు తెలిపారు.

Updated Date - Jul 06 , 2025 | 04:07 AM