టీడీపీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ గుర్తింపు: చమర్తి
ABN , Publish Date - May 12 , 2025 | 11:42 PM
పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని, దానికి నిదర్శనమే పల్లా శ్రీనివాసరావు ఆ పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగనమోహనరాజు అన్నారు.
రాజంపేట టౌన, మే 12 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని, దానికి నిదర్శనమే పల్లా శ్రీనివాసరావు ఆ పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగనమోహనరాజు అన్నారు. రాజంపేటలో సోమవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. చమర్తి జగనమోహనరాజు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ కార్యాలయంలో కేక్‌ను కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు
మంత్రి మండిపల్లి క్యాంపు కార్యాలయంలో...
రాయచోటిటౌన, మే12(ఆంధ్రజ్యోతి): టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా సోమవారం రాయచోటి పట్టణంలోని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన మేనల్లుడు మౌర్యరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించా రు. ఈ వేడుకల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, మాజీ సర్పంచ వెంకట్రామిరెడ్డి, టీడీపీ నా యకులు ఉసిరికాయలు, సిద్దార్థగౌడ్, రఫి పాల్గొన్నారు.