Nara Lokesh: ఆర్‌డీటీ సేవలు కొనసాగుతాయి
ABN , Publish Date - Sep 22 , 2025 | 04:44 AM
రూరల్ డెవల్‌పమెంట్ ట్రస్ట్(ఆర్‌డీటీ) అంటే స్వచ్ఛంద సంస్థ కాదు. లక్షలాది పేదల బతుకుల్లో వెలుగు నింపిన ఆశాకిరణం. అని విద్యాశాఖ మంత్రి లోకేశ్ అన్నారు.
కేంద్రంతో మాట్లాడుతున్నాం.. సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి
ఆర్‌డీటీ నిర్వాహకుడికి లోకేశ్ హామీ
అమరావతి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ‘‘రూరల్ డెవల్‌పమెంట్ ట్రస్ట్(ఆర్‌డీటీ) అంటే స్వచ్ఛంద సంస్థ కాదు. లక్షలాది పేదల బతుకుల్లో వెలుగు నింపిన ఆశాకిరణం.’’ అని విద్యాశాఖ మంత్రి లోకేశ్ అన్నారు. ఆర్‌డీటీ వంటి మానవతా సంస్థకు తాత్కాలికంగా ఇబ్బందులు వచ్చాయని, వాటిని శాశ్వతంగా పరిష్కరించి సేవలు నిరంతరాయంగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్‌డీటీ నిర్వాహకుడు మాంఛో ఫెర్రర్ ఆదివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి లోకేశ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సేవలకు కలిగిన అంతరాయం, తదనంతర పరిణామాలను మంత్రికి వివరించారు. లోకేశ్ స్పందిస్తూ.. సమస్య శాశ్వత పరిష్కారానికి మార్గాలు అన్వేషిస్తున్నామని, ఇది వరకే కేంద్రంతో మాట్లాడామని, సేవలు కొనసాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. తెలుగు ప్రజల పట్ల, తెలుగు భాష పట్ల ఎనలేని ప్రేమ చూపించే ఫెర్రర్ అంటే తనకు ఎంతో అభిమానమని లోకేశ్ తెలిపారు.