Share News

RBI Regional Office: బెజవాడలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం రెడీ

ABN , Publish Date - Jun 14 , 2025 | 04:49 AM

రాష్ట్రంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. విజయవాడలోని

RBI Regional Office: బెజవాడలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం రెడీ

విజయవాడ, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. విజయవాడలోని పోలీసు కంట్రోల్‌ రూం వద్ద నూతనంగా నిర్మించిన స్టాలిన్‌ సెంట్రల్‌ భవనంలో ఏర్పాటు చేసిన ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాన్ని ఈ నెల 16న ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ టి రబిశంకర్‌ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలో మొత్తం 19 రాష్ట్రాల్లో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. కొత్తగా 20వ ప్రాంతీయ కార్యాలయం విజయవాడ స్టాలిన్‌ సెంట్రల్‌ కాంప్లెక్స్‌లో కొలువుదీరనుంది. ఇప్పటికే ఈ భవనంలో ఆడిట్‌ జనరల్‌ కార్యాలయం ఉంది.

Updated Date - Jun 14 , 2025 | 04:52 AM