Medical College: ఆరుగురు మెడికోలపై ఎలుక దాడి
ABN , Publish Date - Nov 09 , 2025 | 06:01 AM
ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్థులపై ఎలుక దాడి చేసింది! నిద్రపోతున్న సమయంలో ఏకంగా ఆరుగురిని కరవడంతో వారంతా శనివారం ప్రభుత్వాసుపత్రిలో...
ఏలూరు క్రైం, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్థులపై ఎలుక దాడి చేసింది! నిద్రపోతున్న సమయంలో ఏకంగా ఆరుగురిని కరవడంతో వారంతా శనివారం ప్రభుత్వాసుపత్రిలో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ డోసు వేయించుకున్నారు. విద్యార్థులు స్థానిక ప్రభుత్వాసుపత్రి ఆవరణలోని మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ఉంటున్నారు. కాలేజీ భవనాలు నిర్మాణాలు జరుపుతున్న నేపథ్యంలో అక్కడున్న పొదలు, చెట్లను కొట్టి వేయడంతో ఆ ప్రాంతంలో ఉండే ఎలుకలు, ఇతర విషపురుగులు ఆస్పత్రి, హాస్టల్‌లోకి వస్తున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తున్నప్పటికీ.. ఆస్పత్రి అధికారులు మాత్రం నెలనెలా లక్షలాది రూపాయల బిల్లులు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.