Share News

Tirupati: ర్యాపిడో ఆటో డ్రైవర్‌ దురాగతం

ABN , Publish Date - Dec 10 , 2025 | 06:11 AM

తిరుపతిలో ఓ విద్యార్థినిపై ర్యాపిడో ఆటో డ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడి న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Tirupati: ర్యాపిడో ఆటో డ్రైవర్‌ దురాగతం

  • తిరుపతిలో విద్యార్థినిపై అత్యాచారం

  • పరారీలో నిందితుడు.. గాలింపు ముమ్మరం

తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ఓ విద్యార్థినిపై ర్యాపిడో ఆటో డ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడి న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలిపిరి సీఐ రాంకిశోర్‌ తెలిపిన ప్రకారం.. అనంతపురానికి చెందిన విద్యార్థిని తిరుపతిలోని ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. మరో హాస్టల్‌ మారడానికి లగేజీ తీసుకెళ్లేందుకు కొద్దిరోజుల క్రితం ఆన్‌లైన్‌లో ర్యాపిడో ఆటో బుక్‌ చేసుకుంది. దీంతో ఆమె మొబైల్‌ నంబరు, తిరుపతిలోనే ఉంటున్న కర్నూలుకు చెందిన ఆటో డ్రైవర్‌ సాయికుమార్‌ వద్ద సేవ్‌ అయింది. లగేజీ తీసుకెళ్లి దించేశాక.. అతడు ఆమెకు ఫోను చేయడం తో పరిచయం పెరిగింది. ఈ క్రమంలో ఈ నెల 2న సాయంత్రం సాయికుమార్‌ ఆమెకు ఫోన్‌ చేసి భవానీనగర్‌ సర్కిల్‌కు రమ్మని చెప్పాడు. అక్కడి నుంచి ఆమెను ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారాని కి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. చివరికి సోమవారం రాత్రి స్నేహితురాలితో కలిసి బాధితురాలు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద సాయికుమార్‌పై కేసు నమోదు చేశా రు. నిందితుడు ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేయడంతో ఆచూకీ గుర్తించడం కష్టంగా మారింది. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ తీవ్రంగా స్పందించారు. ఆటో డ్రైవర్‌ను తక్షణమే అరెస్టు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

Updated Date - Dec 10 , 2025 | 06:13 AM