జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా రంగా రవికుమార్
ABN , Publish Date - Nov 28 , 2025 | 11:23 PM
కర్నూలు జిల్లా ప్రధాన సెషన్స కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది ఎస్.రంగా రవికుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కర్నూలు లీగల్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ప్రధాన సెషన్స కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది ఎస్.రంగా రవికుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించి జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్దిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయన 1993లో దివంగత సీనియర్ న్యాయవాది ఎన.శ్రీరాములు ఆపీసులో జూనియర్‌గా చేరి న్యాయవాదిగా పలు కేసులలో వాధించారు. ఈయన పదవిలో మూడు సంవత్సరాలు కొనసాగుతారు. రవికుమార్ నియామకంపై సీనియర్ న్యాయవాదులు ఎంఎల్ శ్రీనివాసరెడ్డి, శ్రీవాత్సవ, డి.శివశంకర్ రెడ్డి, పీవీ శ్రీనివాసులు, బార్ అసోసియేషన అధ్యక్షుడు పి.హరినాథ్ చౌదరి, ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.