CM Chandrababu Naidu: సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్ మార్క్
ABN , Publish Date - Dec 29 , 2025 | 03:57 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్నారు. బాలరాముడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
రాముని జీవన విధానం అందరికీ ఆదర్శం
అయోధ్య రాముడిని దర్శించుకున్న చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్నారు. బాలరాముడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యజ్ఞశాల కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఆదివారం ఉదయం అయోధ్య చేరుకున్న చంద్రబాబుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికారులతోపాటు అయోధ్య ఆలయ అధికారులు స్వాగతం పలికారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా, యూపీ మంత్రి సూర్యప్రతాఫ్ షాహీ.. చంద్రబాబుకు దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని సందర్శించిన అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ.. అయోధ్య ఆలయాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా పేర్కొన్నారు. ‘శ్రీరాముని జీవన విధానం అన్ని తరాల వారికీ ఆదర్శం. శ్రీరాముడి విలువలు, ఆదర్శాలు శాశ్వతమైన పాఠాలు. అవి ఎప్పటికీ మార్గదర్శకంగా, నిలవాలని ఆకాంక్షిస్తున్నా. సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్ మార్క్’ అని అన్నారు. శ్రీరామ దర్శనం తనకు నూతన శక్తిని ఇచ్చిందన్నారు. యూపీలో ఆదిత్యనాథ్ సుపరిపాలన అందిస్తున్నారని ప్రశంసించారు. వికసిత్ భారత్ 1947 లక్ష్మాన్ని సాధించాలంటే యూపీ, బిహార్ రాష్ర్టాల అభివృద్ధి ఎంతో అవసరమని చంద్రబాబు ఎక్స్‌లో పేర్కొన్నారు.