Anantapur: వృద్ధాశ్రమం కోసం జోలెపట్టిన ఫైట్ మాస్టర్లు
ABN , Publish Date - Oct 18 , 2025 | 06:01 AM
అనాథ వృద్ధుల అలనా, పాలన చూస్తున్న వారికి బాసటగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఫైట్ మాస్టర్లు రామ్, లక్షణ్ అన్నారు
అనాథ వృద్ధుల అలనా, పాలన చూస్తున్న వారికి బాసటగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఫైట్ మాస్టర్లు రామ్, లక్షణ్ అన్నారు. అనంతపురం జిల్లా నార్పల మండలం కురగానపల్లిలో చెన్నకేశవ వృద్ధాశ్రమం ఉంది. దాని నిర్వహణ కోసం ఫైట్ మాస్టర్లు తమవంతు బాధ్యతగా నార్పలలో జోలె పట్టి నిధులు వసూలు చేశారు.
- నార్పల, ఆంధ్రజ్యోతి