Share News

Visakhapatnam: రాఖీ లాంటి.. రాఖీ పూలు

ABN , Publish Date - Aug 09 , 2025 | 04:34 AM

ఈ పుష్పాలు.. చూడటానికి అచ్చం రాఖీల్లా ఉన్నాయి కదూ! విశాఖ నగరంలోని పెదవాల్తేరులో గల బయో డైవర్సిటీ పార్కులో ఈ పూలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.

Visakhapatnam: రాఖీ లాంటి.. రాఖీ పూలు

ఇంటర్నెట్ డెస్క్: ఈ పుష్పాలు.. చూడటానికి అచ్చం రాఖీల్లా ఉన్నాయి కదూ! విశాఖ నగరంలోని పెదవాల్తేరులో గల బయో డైవర్సిటీ పార్కులో ఈ పూలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. వీటిని పాసిఫ్లోరా, కృష్ణ ఫలం, రాఖీ పుష్పాలు అని పిలుస్తారు. ఇవి రాఖీ మాదిరిగా ఉండటంతో పాటు కట్టేందుకు అనువుగా తీగలు (త్రెడ్‌ మాదిరి) కూడా ఉండటం వీటి ప్రత్యేకత. ఈ పూలను రాఖీ మాదిరిగా కట్టుకోవచ్చని పార్కు వ్యవస్థాపకుడు రామమూర్తి అన్నారు. ఈ చెట్టుకు కాసే పండ్లు తింటే ఒంటికి చలువ చేస్తాయంటున్నారు.

- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి

Updated Date - Aug 09 , 2025 | 04:35 AM